అఖిల్ సరసన నివేద?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే హీరో నాని ‘ఇండస్ట్రీకి హీరోయిన్లను సప్లయ్ చేస్తున్నా’ అని ‘మజ్ను’ ఆడియో వేడుకలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. నాని వరుసగా చేస్తున్న సినిమాల్లో కొత్త హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాడు. ఇక ఆ హీరోయిన్స్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కుతోంది. ‘మజ్ను’ సినిమాలో కూడా నాని ఇద్దరు హీరోయిన్స్‌ని పరిచయం చేయడం విశేషం. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాని హీరోగా ఇటీవలే వచ్చిన ‘జెంటిల్‌మన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన నివేదా థామస్.. ఆ సినిమాతో నటిగా మంచి మార్కులే కొట్టేసింది.
దాంతో ఈ భామకు అవకాశాల వెల్లువ పెరిగింది. లేటెస్టుగా అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా ఓకె అయ్యిందని తెలిసింది. ‘అఖిల్’ సినిమా ఫ్లాప్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ నెక్స్ట్ సినిమా దసరాకు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా ఛాన్స్ కొట్టేసింది. అన్నపూర్ణ బ్యానర్‌లో నాగార్జున నిర్మించే ఈ సినిమాతో నివేదా క్రేజీ అవకాశం కొట్టేసినట్టే?