జోరు పెంచిన సాయిధరమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఇప్పటికే ‘సుప్రీం, ‘తిక్క’ వంటి చిత్రాలతో బాక్సాఫీసును పలకరించాడు. ఇప్పుడు మరింత జోరు పెంచాడు. తేజ్ త్వరలో మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఇందులో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ కాగా, మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం. తేజ్ ఈనెల 19 నుండి నక్షత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీని తరువాత ఇదే నెల 25 నుండి మలినేని చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు హాజరవుతాడు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకూ మాస్ హీరోగానే కనిపించిన తేజ్ ఈ చిత్రంలో ఫ్యాషన్ మాగజైన్ ఎడిటర్‌గా స్టైలిష్‌గా కనిపిస్తాడు. ఈ లుక్ కోసం తేజ్ ముంబై వెళ్లి మేకోవర్ చేయించుకున్నాడని, దర్శకుడు గోపీచంద్ మలినేని తేజ్ పాత్రను చాలా డిఫరెంట్‌గా రూపొందించారని తెలుస్తోంది.