డోరగా నయనతార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయికగా కానె్సప్ట్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించడానికి నయనతార ముందడుగు వేస్తోంది. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఓ హారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘డోర’ అనే పేరును ఖరారు చేశారు. దాసు రామస్వామి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ తెలుగులో దీన్ని అందిస్తున్నారు. సుర ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, డోర చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ , టైటిల్ అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయని, మహిళా ప్రధాన చిత్రంగా నయనతార నటిస్తోందని తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, దర్శకత్వం: దాసు రామస్వామి.