శ్రీమంతుడు మార్క్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ టాలీవుడ్‌లో వంద కోట్ల మార్కెట్‌తో నెంబర్‌వన్‌గా నిలబడ్డాడు. కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్‌తో తీసిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతూ దూసుకుపోతోంది. మళ్లీ మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ మహేష్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. మహేష్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా సామాజిక ఇతివృత్తంతో వుంటుందని తెలిసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలు సామాజిక ఇతివృత్తంతో సందేశాత్మకంగా ఉంటూనే కమర్షియల్ సినిమాగా సత్తా చాటుకున్నాయి. ఇదే తరహాలో తన తదుపరి చిత్రం కూడా ఓ మంచి ప్రయత్నంతో వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే కథా చర్చలు పూర్తిచేసుకుని నవంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.