త్రివిక్రమ్‌తో మూడో సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల చివరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత పవన్ నటించే తదుపరి చిత్రం కన్‌ఫర్మ్ అయింది. ఆయన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని ‘జులాయి’,‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ చిత్రాలు నిర్మించిన రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే కథాచర్చలు జరుగుతున్నాయని, నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.