భలేఛాన్స్‌లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటినుండి సినిమాలు వస్తున్నాయి కానీ హిట్ మాత్రం దక్కడంలేదు. కనీసం ‘నాయకి’తో అయినా భయపెట్టి హిట్ కొట్టాలని ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. దాంతో ఇంకాస్త స్లిమ్‌గా మారి జిమ్‌లో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. అప్పట్లో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘సామి’ చిత్రానికి రీమేక్ రూపొందుతుంది. హరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట. హరి ప్రస్తుతం సూర్యతో ‘సింగం-3’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తెరకెక్కించే సినిమా ఇదే. విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. త్రిష కూడా ఫైనల్ అయ్యేలా వుందని తెలిసింది. మొత్తానికి త్రిష క్రేజీ ఆఫర్‌నే సొంతం చేసుకుందన్నమాట!