మనలో ఒకడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. అనిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూని క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ. కవిత, మాజీ సిబిఐ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, నటుడు గొల్లపూడి మారుతిరావు, చంద్రసిద్ధార్థ్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీని జె.డి.లక్ష్మీనారాయణ విడుదల చేశారు. అనంతరం గొల్లపూడి మారుతిరావు మాట్లాడుతూ..‘నేను సినిమా రంగంలోకి వచ్చి 53 సంవత్సరాలు అయింది. మీడియాకు వచ్చి 56 సంవత్సరాలు అయింది. ఈ రెండింటిని కలిపి ఆర్.పి.పట్నాయక్ సినిమాను రూపొందించాడు. కత్తికంటే కలం పదునైంది. కానీ ఈ రెండింటికంటే సినిమా పదునైంది. ప్రస్తుతం మీడియాలో చెప్పాల్సిన విషయాల్ని దాచి, వ్యాపారాత్మకం చేస్తున్నారు. మనలో ఒకడు గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. సామాజిక స్పృహ అనేది మీడియాకి ఉండాలి’ అన్నారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ‘మీడియాలో అందరూ ఒక్కొక్క కోణాన్ని ఒక్కోలా చూపిస్తున్నారు. కానీ వాస్తవాన్ని చూపడం లేదు. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమ్ ఉన్నప్పుడే సినిమా గానీ, మీడియా గానీ రిఫైన్ అయి బాగుపడుతుంది. తప్పకుండా ఈ సినిమా జనంలో మంచి ఆదరణ పొందాలి’ అన్నారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ‘నా మనసులోని మాటల్ని ఈ సినిమాలో చెప్పాను. ప్రోమోస్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది’ అన్నారు.