లక్ష్మీబాంబ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో గుణపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్ పతాకంపై వేళ్ల వౌనికాచంద్రశేఖర్, ఉమాలక్ష్మీనరసింహ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీబాంబ్. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న సందర్భంగా హీరోయిన్ మంచు లక్ష్మి మాట్లాడుతూ, ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నానని, సబ్జెక్ట్ విని ఎగ్జైట్ అయ్యానని, ఇందులో జడ్జి పాత్రలో నటిస్తుండడం ఆనందంగా వుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాల్ని తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చిత్రీకరించడం ఆనందంగా వుందని అన్నారు. సమర్పకుడు సురేష్‌రెడ్డి మాట్లాడుతూ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని త్వరలో పూర్తిచేసి దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా బాగా వచ్చింది. జయప్రద నటించిన జస్టిస్ రుద్రమాదేవి తర్వాత అంతటి పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నది మంచు లక్ష్మి. మనోజ్ ఫైట్ కంపోజ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సెప్టెంబర్‌లో పాటల్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి, నిర్మాతలు: వౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ, దర్శకత్వం: గోపాలకృష్ణ.