4న దర్శకుడు విక్రమ్‌కుమార్ వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇష్క్’, ‘మనం’, ‘24’ లాంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు విక్రమ్‌కుమార్. ముఖ్యంగా సూర్యతో తెరకెక్కించిన 24 సినిమాతో భిన్నమైన ప్రయోగం చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. త్వరలోనే ఈయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విక్రమ్ ఇటీవలే చెన్నయ్‌కి చెం దిన శ్రీనిధి అనే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిం ది. ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ వద్ద సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ ‘24’ చిత్రానికి సంగీతం అందిస్తున్న సమయంలో విక్రమ్‌తో ఆమె పరిచయం ఏర్పడిందట. అది ప్రేమగా మారిందని తెలిసింది. ఇటీవలే నిశ్చితార్ధం జరుపుకున్న వీరి వివాహం సెప్టెంబర్ 4న చెన్నయ్‌లోని ఓ హోటల్‌లో సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరగనుందట.