డర్టీగేమ్ టాకీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీకపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం డర్టీగేమ్. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్టు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాత్రలకు తగిన విధంగా నటీనటులను నిర్మాత ఎంపిక చేశారని, అందుకు అతన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఇలాంటి కథతో సినిమాను నిర్మిస్తున్న ఆయన గట్స్‌ను కూడా మెచ్చుకుంటున్నానని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు. అతి తక్కువ టైములో నిర్మాత తనకు స్నేహితుడిగా మారిపోయారని, ఓ మంచి పాత్రలో తాను డర్టీగేమ్‌లో నటించానని నటుడు సురేష్ తెలిపారు. నిర్మాణాత్మక విలువలతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత అన్ని విధాల చిత్రాన్ని చక్కగా రూపొందించడానికి సహకరించారని, టాకీపార్టు పూర్తిచేశామని, సునీల్ కశ్యప్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ అన్నారు.