ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం జనతా గ్యారేజ్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో ఇంటర్వ్యూ..
అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు.. టెన్షన్‌గా లేదా?
కావాలనే ఒకరోజు ముందు విడుదల చేస్తున్నాం. వచ్చే నెల రెండో తేదీ హాలీడే రావడంతో ముందుగానే వస్తున్నాం. టెన్షన్ ఏమీ లేదు.
సినిమా ఎలా సెట్ అయింది?
శ్రీమంతుడు సినిమా చేయకముందే ఈ సినిమా ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాను. అప్పటికే చర్చలు కూడా జరిగాయి. కానీ, మహేష్‌బాబుతో ఉన్న కమిట్‌మెంట్ వల్ల ఆ సినిమా తర్వాత చేయాల్సి వచ్చింది.
మోహన్‌లాల్‌ను ముందే అనుకున్నారా?
కథలో ఒక పవర్‌ఫుల్ పాత్ర వుంటుంది. దానికి బాగా ఇమేజ్ ఉండి పవర్ వున్న నటుడైతే బావుంటుందని అనుకున్నాం. మొదటినుంచి కూడా నా మనసులో మోహన్‌లాల్ మెదిలారు. ఈ పాత్ర ఆయన చేస్తేనే
న్యాయం జరుగుతుంది. వేరే ఎవర్ని పెట్టినా అంతగా వర్కవుట్ కాదు.
మీ సినిమాల్లో హీరోతోపాటు మరో పాత్ర కూడా సమాంతరంగా ఉంటుంది. కారణం?
అలా అని కాదు. మన సినిమాలు జనాల్లోనుండి రావాలి. ఫ్యామిలీ కథలను డీల్ చేసేటప్పుడు తప్పకుండా ఒక కీలక పాత్ర ఉంటుంది తప్ప కావాలని పెట్టింది కాదు. మిర్చి సినిమాలో సత్యరాజ్, శ్రీమంతుడులో జగపతిబాబు.
సోషల్ ఎలిమెంట్‌తో కమర్షియల్ సినిమా చేయడం కష్టం కదా?
సోషల్ మెసేజ్‌తో సినిమా చేయాలంటే కష్టమే. స్టార్ హీరోలతో డీల్ చేసే విషయంలో చాలా కేర్‌తో ఉండాలి. నావరకైతే చెప్పే కథను సోషల్ మెసేజ్‌తో కలిపి అందంగా చెప్పాలని అనుకుంటాను. అంతేకానీ ఆరు ఫైట్లు, ఒక ఐటమ్‌సాంగ్ పెట్టి చేస్తే ఎవరూ చూడరు.
ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎలా వుంది?
ఎన్టీఆర్‌తో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. బృందావనం సినిమా దగ్గరనుంచి తను నాకు బాగా క్లోజ్ అయ్యాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. అంతకన్నా ఎక్కువే. తనలో ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. ప్రతి దానికీ ఇంపాక్ట్ అవుతాడు. నటన విషయంలో కూడా మంచి క్లారిటీతో ఉంటాడు. ఎంతవరకూ అవసరమో అంతవరకూ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల నటుడు.
మోహన్‌లాల్‌తో డబ్బింగ్ కూడా చెప్పించారట?
నిజానికి ఆయన వాయిస్ బావుంటుంది. ఆయనతో డబ్బింగ్ చెప్పిద్దామని ట్రై చేశాం కానీ, తెలుగు పదాలు పలకడంలో కాస్త తేడా అనిపించింది. దాంతో ఆయనతో కాకుండా వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాం. ఆయన కూడా డబ్బింగ్ కోసం బాగానే కష్టపడ్డారు. ఒక పల్లెటూరు వ్యక్తి స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడతాడో అలా రావాలి కాబట్టి నా వాయిస్ బాగుండదని ఆయనే అన్నారు.
ఇంతకీ జనతా గ్యారేజ్ ఏమిటి?
ఒకరికి భూమి అంటే ఇష్టం. మరొకరికి భూమి మీద మనుషులంటే ఇష్టం. వీరిద్దరూ కలిసి ఏం చేశారు? ఎలాంటి రిపేర్లు చేశారన్నదే కథ.
మీలో రైటర్‌కు, డైరెక్టర్‌కు ఉన్న తేడా ఏమిటి?
రైటర్ అంటే ఎంతైనా రాయగలడు. దర్శకుడు తనకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాడు. ఈ రెండు విషయాలను నాలోని రైటర్ దర్శకుడికి కావాల్సిందే ఇస్తాడు.
స్టార్ హీరోలతో సినిమాలు చేయడం టెన్షన్‌గా ఫీలయ్యారా?
టెన్షన్ ఎందుకు? కథను ముందుగానే ఆ హీరో ఓకే చేస్తాడు. దానికి తగ్గట్టే అతని పాత్ర వౌల్డ్ చేసుకుంటాడు. స్టార్ హీరోతో చేస్తున్నామంటూ హంగామాలు చేయం కదా? ఈమధ్య హీరోలే ‘ఇలాంటి డైలాగ్స్ వుంటే జనాలు ఒప్పుకోరయ్యా’ అని మనకు సలహాలు కూడా ఇస్తున్నారు.
ఇద్దరు హీరోయిన్ల గురించి?
ఇందులో సమంత, నిత్యామీనన్‌ల పాత్రలు కీలకంగానే ఉంటాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా కథకు న్యాయం చేసేలా ఉంటాయి.
కాజల్‌తో ప్రత్యేక పాట చేయించడానికి కారణం?
సినిమాలో కథ నడుస్తూనే ఇంకా ఆకట్టుకునే విషయం ఉంటే బావుంటుందని అనిపించింది. దాంతో స్పెషల్ పాట పెట్టాలని అనుకున్నాం. ఈ సాంగ్‌ని మామూలు వాళ్లతో చేయిస్తే అంతగా ఇంపాక్ట్ వుండదని స్టార్ హీరోయిన్‌తో చేయించాలని కాజల్‌ని సంప్రదించాం.
రామ్‌చరణ్‌తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి?
ఇప్పటికైతే అలాంటిదేం లేదు. తప్పకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తా. సమాజంలో నన్ను కదిలించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి వాటితో సినిమాలు చేయాలని వుంది.
తదుపరి చిత్రాలు?
- మహేష్‌బాబుతో సినిమా ఉంటుంది. డి.వి.వి.దానయ్య నిర్మించే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.

- శ్రీ