9/ఎ కృష్ణలంకలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.్ఫలిమ్స్ పతాకాలపై సుధాకర్ అండ్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న 9/ఎ కృష్ణలంక చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా తెలంగాణా మంత్రి చందూలాల్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ, టెర్రరిజం నేపధ్యంలో సాగే కథ ఇదని, దాంతోపాటు మంచి ప్రేమకథ కూడా ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ, ‘కథ చాలా బాగుంది, ఇందులో నేనో పాత్ర కూడా చేస్తున్నాను. కంటెంట్ ఉంటే అది చిన్న చిత్రమా? పెద్ద చిత్రమా? అని ఎవరూ చూడరు. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. నిర్మాత అరుణ్ మాట్లాడుతూ, సిక్కిం, కేరళ, విజయవాడ తదితర ప్రాంతాల్లో 90 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుమన్నారు. మొదటి ప్రయత్నంలోనే మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: అరుణ్, దర్శకత్వం: సుధాకర్ అండ్ శివ.