నిఖిల్ సరసన రీతూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదివరకే రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ పెళ్లిచూపులు సినిమాతో దక్కించుకుంది అందాల భామ రీతూవర్మ. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిన్న చిత్రంగా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో రీతూవర్మకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు ఎవరినోట విన్నా రీతూవర్మ పేరే వినిపిస్తోంది. ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. తాజాగా ఈమెకు మరో ఛాన్స్ దక్కింది. నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఓకే అయ్యిందట. మరో రెండు సినిమాల్లో కూడా రీతూ నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. నిఖిల్, సుధీర్‌వర్మల కాంబినేషన్‌లో వచ్చిన స్వామిరారా సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.