శరవేగంగా వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య జంటగా రాహుల్‌ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంక కరుణాకర్‌దాస్ రూపొందించిన చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత కరుణాకర్‌దాస్ మాట్లాడుతూ, ఇదొక వెరైటీ ప్రేమకథనంతో రూపొందించిన చిత్రమని, సినిమా పేరుకు తగ్గట్టుగానే అందంగా,సప్తవర్ణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. కేరళలో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా వుంటాయని తెలిపారు. త్వరలో ఆర్‌ఎఫ్‌సిలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుందని, టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. శ్రీ సయ్యని, హేమ, ప్రభాస్‌శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభుప్రవీణ్, మాటలు: పవన్, కెమెరా: ఎస్.డి.జాన్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రతీప్ ప్రేమ్‌కరణ్.