మలయాళ రీమేక్‌లో సునీల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే జక్కన్నతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సునీల్, ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా తరువాత ఓనమాలు ఫేం క్రాంతికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సునీల్, తాజాగా మరో చిత్రానికి కమిట్ అయినట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారట. ఇప్పటికే దానికి సంబంధించిన హక్కులను తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం వుంది.