టాలీవుడ్‌పై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ అమలాపాల్ ప్రస్తుతం తన భర్త విజయ్‌తో విడాకుల విషయంపై కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈమధ్య అమలాపాల్‌ను కోలీవుడ్ దూరం పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఈమె ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చేజారిపోవడమే. కొత్తగా అవకాశాలు కూడా రావడంలేదట. దాంతో కావాలనే తనను అవాయిడ్ చేస్తున్నారని భావించిన ఈమె, ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టిపెట్టాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే ఇక్కడ మూడు నాలుగు సినిమాలు చేసి గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈనేపథ్యంలో పలువురు దర్శక నిర్మాతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, హరీశ్ శంకర్‌ల సినిమాలో అమలకు ఛాన్స్ దక్కే అవకాశం వున్నట్లు తెలిసింది. ఇప్పటికే అల్లుఅర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించింది.