కాష్మోరాలో కార్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ నటుడు కార్తి తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులో ‘ఊపిరి’ చిత్రంలో నటించిన కార్తి, ప్రస్తుతం కాష్మోరా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కార్తి లుక్ కొత్తగా వుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ యుద్ధ నేపథ్యంలో నటించే కథలో సైనికాధికారిగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. పివిపి సినిమా పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తి సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి కాష్మోరా ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది.