నితిన్‌తో అందాల రాక్షసి దర్శకుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ల దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి ఆ మధ్య అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇద్దరూ ఖరారు చేస్తూ, తమ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలియజేశారు. అయితే- ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అఖిల్ వేరొక నిర్మాత సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందున హను రాఘవపూడి సినిమా ఇప్పట్లో చేయలేరని తెలిసింది. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి నితిన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అఖిల్‌తో సినిమా చేయాలని హను ప్లాన్ చేస్తున్నారట. ‘అ ఆ’ విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, హను రాఘవపూడితో పని చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.