కేరళలో వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యని ప్రధాన తారాగణంగా రాహుల్ ఫ్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న ‘వానవిల్లు’కు సంబంధించి కేరళ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత కరుణాకర్‌దాస్ మాట్లాడుతూ, ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ అని, కథనానికి తగ్గట్టుగా ఈ చిత్రానికి ఆ పేరు నిర్ణయించామని, భావోద్వేగ ప్రేమకథనంతో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా రూపొందించామన్నారు. చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను కేరళలో చిత్రీకరించామని, ఇప్పటికే మలేసియాలో టాకీపార్ట్, పాటల చిత్రీకరణ పూర్తిచేశామన్నారు. తరువాతి షెడ్యూల్ సెప్టెంబర్ తొలివారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుందని, ఈనెలాఖరుకు టీజరను విడుదల చేస్తామన్నారు. హేమ, ప్రభాస్‌శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్తస్త్ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ప్రభు ప్రవీణ్, మాటలు:పవన్, కెమెరా:ఎస్.డి.జాన్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం:ప్రతీక్ ప్రేమ్‌కరణ్.