ఏంజిల్ వచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగఅనే్వష్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా ముప్పా వెంకటయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిలింస్ బ్యానర్‌పై ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో భువన్ సాగర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏంజెల్’ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఠాగూర్ మధు కెమెరా స్విచ్చాన్ చేయగా, సాయిధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. పళని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘వినవయ్యా రామయ్యా’ తర్వాత మా బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రమిదని, తొలి చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదని, కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నామని అన్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్‌పై ఏడాదిపాటు డైరెక్షన్ టీం వర్క్ చేసిందన్నారు. అన్నీ ఓకే అయిన తర్వాతే సినిమాను స్టార్ట్ చేశామని, పెద్దబ్బాయి భువనసాగర్ ఈ చిత్రానికి నిర్మాతగా పరిచయం అవుతున్నాడని, దర్శకుడు పళని ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ అని, ప్రతి సీన్‌కు సంబంధించిన వర్కంతా, అంటే లొకేషన్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇలా అన్ని విషయాలను ముందుగానే రెడీ చేసేశాడని అన్నారు. ‘అలా ఎలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘ఆడోరకం ఈడోరకం’ సినిమాలతో హ్యాట్రిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందని, మంచి టాలెంట్ ఉన్న ఆమె లక్కీ హీరోయిన్ అని, రేపటి నుండే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి నాలుగు నెలల్లో పూర్తిచేస్తామన్నారు.
దర్శకుడు బాహుబలి పళని మాట్లాడుతూ, రాజవౌళివద్ద అసోసియేట్ డైరక్టెర్‌గా పనిచేశానని, తాను దర్శకుడిగా మారడానికి ఆయన ఎంతో సపోర్టు చేశారని, హీరో నాగఅనే్వష్‌లో మంచి ఎనర్జీ వుందని, భీమ్స్ మంచి మ్యూజిక్ అందించాడని అన్నారు. హీరో నాగఅనే్వష్ మాట్లాడుతూ, హీరోగా ఇది తన రెండో చిత్రమని, మంచి టీం కూడా కుదిరిందని అన్నారు. హెబా పటేల్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన పాత్ర గురించి తెలిసిన వెంటనే ఒప్పుకున్నానని, తప్పకుండా మంచి హిట్ అవుతుందని అన్నారు. నాగఅనే్వష్, హెబాపటేల్, సప్తగిరి, సుమన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:వేంపల్లి రమేష్‌రెడ్డి, బహుబలి పళని, రచనా సహకారం:శ్రీనివాస్ లంకపల్లి, ప్రదీప్, శంకర్ మైచర్ల, రాజ్‌కుమార్.కె., మాటల సహకారం:శ్రీనివాస్ అంకాలపు, వీరబాబు బాసిన, కొరియోగ్రఫి:శేఖర్, జానీ, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, సంగీతం:్భమ్స్, సినిమాటోగ్రఫి:గుణా, సహ నిర్మాత:యోగీశ్వర్‌రెడ్డి, నిర్మాత:్భవనసాగర్, దర్శకత్వం:బాహుబలి పళని.