కిశోర్ తిరుమలతో వెంకీ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న కథా చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, ప్రస్తుతం ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ‘నేను శైలజ’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని పిఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రాంమోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తరహాలో వుంటుందని అన్నారు. వెంకటేష్‌నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, వెంకటేష్ పాత్ర సహజంగా వుంటుందని, త్వరలోనే కథానాయికతోపాటు మరిన్ని వివరాలు తెలియజేస్తాం అన్నారు.