ఏప్రిల్ 28న బాహుబలి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ చిత్రం అంతే భారీ వసూళ్లను దక్కించుకుంది. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ రూపొందుతోంది. ది కన్‌క్లూజన్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారట. నిజానికి ఏప్రిల్ 14నే విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని పరిస్థితులవల్ల విడుదల తేదీ మారిందట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ తెలిపారు. ప్రస్తుతం ఫిలిమ్ సిటీలో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈరోజునుండి యూనిట్‌కి సెలవులు ఇచ్చారట. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఇప్పటికే అందరిలో మెదులుతోంది. మరోవైపు ఈ సినిమా తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయ.