నీలిమలై ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ కృష్ణ, శిల్ప జంటగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో నీలిమ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, ప్రతాని రామకృష్ణగౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే చిత్రం ఇదని, పంచభూతాలకు, 18 మెటల్స్‌కు వున్న సంబంధాన్ని తెలియజేస్తుందని, అలాగని ఇది డివోషనల్ సినిమా కాదని, లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోసహా అన్ని అంశాలు కలగలసిన సినిమా అని, నీలిమలై అనేది శబరిమలైకు వెళ్లేటప్పుడు వచ్చే కొండ అని, అందుకే ఆ టైటిల్ పెట్టామని అన్నారు. హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ, తప్పకుండా డిఫరెంట్ సినిమా అవుతుందని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కే ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:దేవేంద్ర సదివె, కెమెరా:కాంతారావు, ఆర్ట్:విజయకృష్ణన్, నిర్మాత:ఆనంద్ కృష్ణ, దర్శకత్వం:సూర్యకిరణ్ ఇలాది.