5న వస్తున్న శివగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడలో ఘనవిజయం సాధించిన ‘నాని’ చిత్రాన్ని తెలుగులో ‘శివగామి’గా విడుదల చేస్తున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ పతాకంపై మనీష్ ఆర్య, ప్రియాంకారావు, బేబి సుహాసిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుమంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సి.కల్యాణ్ మాట్లాడుతూ, ట్రైలర్‌లోనే సక్సెస్ కనిపిస్తుందని, మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కన్నడంలోకంటే తెలుగులో మంచి విజయం సాధించాలి. ఈ సినిమా తరువాత శివగామి సత్యనారాయణగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ పేరు వినిపిస్తుంది అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, నెల రోజుల క్రితం విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో అక్కడ నడుస్తోందని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని ఈనెల 5న విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సి.కల్యాణ్‌ను నిర్మాత రామసత్యనారాయణ సత్కరించారు.