పాటల జానకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీక్షాపంత్, ధన్‌రాజ్, షకలక శంకర్ ముఖ్యపాత్రల్లో నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రెజీనా, నందినిరెడ్డి, తనీష్, సంపూర్ణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించామని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని, సినిమా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభంలో ఆటుపోట్లు, ఆర్థికబాధలు ఎదుర్కొంటున్నపుడు తనను ఆదుకున్న రామ్ ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా రావడం ఆనందంగా వుందని, టీమ్ అందరి సహకారంవల్ల సినిమా బాగా వచ్చిందని అన్నారు. దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ, సినిమా బాగా వచ్చింది. ముఖ్యంగా మంచి మ్యూజిక్ కుదిరింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.