ఆకట్టుకున్న బి.ఎఫ్.జి.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జురాసిక్ పార్క్, జాస్, ఇండియాజోన్స్ వంటి చిత్రాల సృష్టికర్త స్టీవెన్ స్పిల్‌బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన మరో ఫాంటసీ చిత్రం ‘బి.ఎఫ్.జి.’ (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్). డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధి మాట్లాడుతూ చిత్రంలోని గ్రాఫిక్స్ అటు పిల్లలను, అటు పెద్దలను ఆకర్షిస్తున్నాయని, అన్ని భాషలలో మంచి సమీక్షలు కూడా లభించాయని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రంలో స్నేహపూర్వకమైన మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగిన అద్భుతమైన కథను దర్శకుడు అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించారని ఆయన తెలిపారు. తెలుగు నటుడు జగపతిబాబు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఓ విశేషంగా అందరూ భావిస్తున్నారని అన్నారు.