ఉత్కంఠగా చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు జరుగుతున్న సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ, ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్టులు ఆడియన్స్‌కు షాక్‌కు గురిచేస్తాయి. అంజలి పాడిన పాట హైలెట్‌గా వుంటుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే ఇతివృత్తం. ‘గీతాంజలి’ తర్వాత అంజలి నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కథానుగుణంగా అమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రించాం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సింధు తులాని, సప్తగిరి, రక్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటర్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:జి.అశోక్, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్.