కమర్షియల్ అంశాలతో ‘అరకు రోడ్‌లో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నిఖిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ‘అరకురోడ్‌లో’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరో రామ్‌శంకర్ మాట్లాడుతూ,‘ ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కే ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం’అన్నారు. హీరోయిన్ నిఖిషా పటేల్ మాట్లాడుతూ,‘ ఇది యాక్షన్ తరహాలో సాగే థ్రిల్లర్ సినిమా. ఇందులో నా పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు. దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ,‘ఇది థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. అనుకున్నట్లు షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. అలాగే సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అన్నారు. నటుడు అభిమన్యు సింగ్ మాట్లాడుతూ, ‘తప్పకుండా నా కెరీర్‌లో బెస్ట్ రోల్ ఇది అని చెప్పాలి. రామ్‌శంకర్ కూడా అద్భుతంగా నటిస్తున్నాడు.’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన సురేష్ వర్మ మాట్లాడుతూ, ‘వాసుదేవ్ చెప్పిన కథ చాలా బాగా నచ్చడంతో ఈసినిమాను మేమే నిర్మించాలని అనుకున్నాం. చిత్రానికి సం బంధించిన అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తిచేసి విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రాహుల్‌రాజ్, వాసుదేవ్, కెమెరామెన్:జగదీశ్ చీకటి, ఎడిటర్:మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్:కృష్ణమాయ, స్టంట్స్: జాషువా, నిర్మాతలు:మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ, ఇందుకూరి, నక్కా రామేశ్వరి, రచన, దర్శకత్వం:వాసుదేవ్.