చిరు సరసన కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి సంబంధించి ఇటీవల పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవరంటూ ఎవరెవరో పేర్లు వినిపించాయి. విజయశాంతిని కూడా వదలకుండా ఆమే హీరోయిన్ అన్న మాటలు సైతం వినిపించాయి. ఎట్టకేలకు చిరు అభిమానుల్లో ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. చిరు సరసన కాజల్ నటిస్తోంది. రామ్‌చరణ్ సరసన నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హీరోయిన్ ఆమె. ఈ చిత్రంలో ఆమె చిరంజీవితో కలిసి నటిస్తే శ్రీదేవి క్రియేట్ చేసిన రికార్డు కాజల్ సొంతమవుతుంది. నటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో తన హీరో ఇమేజ్ పక్కన పెట్టి నటిస్తుండడం మరో విశేషం. అయితే ఈ చిత్రానికి ఇంకొక్క అవరోధం వెంటాడుతోంది. ఈ చిత్రానికి ఏం పేరు పెట్టాలనేదే ఇంకా ఖరారు కాని విషయం. తమిళంలో విజయవంతమైన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తయారవుతున్న ఈ సినిమాకు మొదట ‘కత్తి’ అన్న పేరును చెప్పారు. ఆ తరువాత ‘కత్తిలాంటోడు’ అన్నారు. ఇప్పుడు మంచి పేరుకోసం పరిశీలిస్తున్నామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. టైటిల్ పేరిట ఉత్కంఠతో మరికొన్నాళ్లు చిరు సినిమాకు ఉచిత పబ్లిసిటీ లభిస్తుందన్నమాట.