రామ్ హైపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంద్, అనీల్ సుంకర రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘హైపర్’ ( ట్యాగ్ లైన్.. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఇందులో హీరో పాత్ర హైపర్‌గా వుంటుందని అందుకు తగ్గట్టుగా ఈ పేరును ఖరారు చేశాం. సాధారణంగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు హైపర్‌గా వుంటారని, అలా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. రామ్ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్ చిత్రంగా ఈ సినిమా వుంటుందని తెలిపారు. ఆగస్టు 3న ఫస్ట్‌లుక్‌ను, సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా సినిమాను విడుదల చేస్తాం. అన్ని వర్గాలకు ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని నిర్మాతలు అన్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, ఆర్ట్:అవినాష్, సమర్పణ:వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంద్, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్.