మంచి ప్రేమకథా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పారుల్, సరయు హీరో హీరోయిన్లుగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో శ్రీ సత్యవిదుర మూవీస్ పతాకంపై ఎం.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతలేక’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 13న విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగశౌర్య చెప్పిన విశేషాలు..
అచ్చమైన ప్రేమకథ
మంచి లవ్ ఫీల్ వున్న సినిమా ఇది. ఇందులో నేను మోడల్‌గా కనిపిస్తా. కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న ఓ యువకుడి జీవితంలోకి అమ్మాయి ప్రవేశిస్తే, అతని కెరీర్ ఎలా టర్న్ అయింది అనే మంచి పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.
అన్ని రకాల అంశాలు
ప్రేమకథా చిత్రమైనా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దర్శకుడు లారెన్స్ దాసరి అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి విషయంలో ఆయన కేర్ చాలా వుంది. నిర్మాతలు సినిమా బాగా రావడానికి కృషిచేశారు.
ఇద్దరు హీరోయిన్లు
ఈ చిత్రంలో పారుల్, సరయు ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. మరోవైపు గ్లామర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నీ జతలేక టైటిల్ జస్ట్ఫికేషన్ సినిమా చూస్తే తప్పకుండా అర్థమవుతుంది.
తర్వాతి చిత్రాలు
ప్రస్తుతం జోఅచ్యుతానంద చిత్రం చేస్తున్నాను. దీంతోపాటు సాయి కొర్రపాటి బ్యానర్‌లో ఓ సినిమా. సుకుమార్ ప్రొడక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాను.