భారీ సెట్స్‌లో జాగ్వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన కథానాయకుడు నిఖిల్‌కుమార్‌ను పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ మనవడైన నిఖిల్‌కుమార్‌ను తెలుగులో పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా హైయాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజింగ్, ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు. జాగ్వార్ చిత్రాన్ని విదేశీ సాంకేతిక నిపుణులతో హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో వేయనున్న భారీ సెట్లో జరిగే షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం పూర్తిచేస్తామని, ఈ సంవత్సరంలో ఓ సెనే్సషనల్ హిట్‌గా సినిమా నిలుస్తుందని వారు తెలిపారు. జగపతిబాబు నటించే పాత్ర కీలకంగా వుంటుందని అన్నారు.