అంచనాలను మించిన బిచ్చగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన ‘బిచ్చగాడు’ సినిమా విజయయాత్ర కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి మంచి హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై 75 రోజులు దాటింది. మొత్తం 200 థియేటర్లలో ఇంకా ఆడుతోంది. ఈమధ్యకాలంలో 50 రోజులే గొప్ప అనుకుంటే.. శతదినోత్సవం వైపు దూసుకెళుతోంది బిచ్చగాడు సినిమా. మొదట్లో చాలా తక్కువ థియేటర్లలనుంచి క్రమంగా వందల థియేటర్లకు విస్తరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ఓ ప్రక్క ప్రేక్షకులను నిరాశపరుస్తుంటే, ఏ అంచనా లేని బిచ్చగాడు ఈ రేంజ్ హిట్ కొట్టడం మాటలు కాదు. బ్రహ్మోత్సవం, అ..ఆ, కబాలి వంటి పెద్ద సినిమాలను తట్టుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకొంది బిచ్చగాడు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈసినిమా కేవలం పబ్లిక్ వౌత్‌టాక్‌తోనే పుంజుకుని అదరగొడుతోంది. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది నిరూపించింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, దర్శకుడు శశి మేకింగ్ తీరుతో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇంకా తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఈ సినిమా భారీ స్థాయిలో ఆకట్టుకుంది.