హిట్టు కావాలట!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన అవకాశం ఒక్కటి రాగానే కొథ్దిమంది తారలు అలా అల్లుకుపోతుంటారు. కొద్దిమంది మాత్రం ఎన్ని మంచి అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేరు. అలాంటి భామల్లో అక్ష ఒకరు. ‘యువత’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో కందిరీగ లాంటి బంపర్ హిట్టుంది. ఆ తర్వాత కొన్ని మంచి సినిమాల్లోనూ నటించింది. సరైన ప్లానింగ్ లేక జోరు కొనసాగించలేకపోయింది. ఇక ఆమె పనైపోయినట్టే అనుకుంటున్న తరుణంలో బాలయ్య ‘డిక్టేటర్’లో అవకాశం కొట్టి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్రే. తాజాగా ఆమెకి మరో ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న చిత్రంలో అక్ష కీలక పాత్ర పోషిస్తోందట. అందులో ఇప్పటికే లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి అక్షకి ఎలాంటి పాత్ర దక్కిందో. ఈ చిత్రంతోనైనా కందిరీగలా మరోసారి హిట్ కొడుతుందేమో!