ఒకేసారి ఐదు చిత్రాలతో నామా అభిషేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా నిర్మాణ రంగంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ మరోసారి కొత్త ప్రయోగానికి తెరతీసింది. శ్రీమంతుడు, రుద్రమదేవి, నాన్నకు ప్రేమతో, సుప్రీమ్, కబాలి వంటి చిత్రాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐదు క్రేజీ చిత్రాల నిర్మాణంలో ఉన్నారు. అన్ని చిత్రాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ, సరైనోడుతో హిట్ అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా, రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా రూపొందించే చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందన్నారు. అదే నెలలో నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందిస్తామని, అడవి శేష్, ఆదాశర్మ జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఆగస్టు చివరి వారంలో ఓ సినిమా ప్రారంభించనున్నామని, ఈ చిత్రానికి గూఢచారి అనే పేరు ఖరారు చేశామని, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా సుధీర్‌బాబు హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నామని, ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. హిందీలో వచ్చిన హంటర్ చిత్రాన్ని రీమేక్‌గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశామని, లండన్‌డ్రీమ్స్ దర్శకుడు నవీన్ మేడారం నిర్దేశకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇలా ఒకేసారి ఐదు చిత్రాలను రూపొందించడం తమ సంస్థకు గర్వకారణమని ఆయన అన్నారు.