అమీర్‌పేటలో పాటలు హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, ఎప్పుడూ రద్దీగా వుండే అమీర్‌పేటలో అనేక రకాల మనస్తత్వాల మనుషులు తిరుగుతుంటారని, వారిని క్షుణ్ణంగా పరిశీలించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, మంచి విజయం సాధించాలని అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే అమీర్‌పేట మైత్రీవనం వద్ద పరిస్థితులను అధ్యయనం చేసి ఈ కథను రాసుకున్నానని, నిర్మాత మహేష్ అండగా నిలవడంతో ఈ చిత్రం రూపొందిందని హీరో, దర్శకుడు శ్రీ తెలిపారు. పోస్టర్, టైటిల్, టీజర్, పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఖమ్మంలలో సినిమా ప్రమోషన్‌కు సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు.