జక్కన్న ఆడియో సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘జక్కన్న’. ఈనెల 29న దీన్ని విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, అందరినీ మెప్పించేలా ఉన్న ఈ సినిమాను ఈనెల 29న గ్రాండ్‌గా విడుదల చేస్తామన్నారు. సునీల్ తనదైన స్టైల్‌లో కామెడీ హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అన్నారు. మంచి కథ కోసం ఎదురుచూసిన నిర్మాత ఈ కథ నచ్చి సినిమా చేశారని, సునీల్ యాక్టివ్‌గా నటించారని దర్శకుడు మారుతి అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, అనుకున్నదానికన్నా దర్శకుడు బాగా రూపొందించారని తెలిపారు. మాటలన్నీ పంచ్‌లతో చకచకా సాగుతాయని, జక్కన్న మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని సునీల్ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు దినేష్‌తోపాటుగా సినిమాలో నటించిన నటీనటులకు, యూనిట్ సభ్యులకు ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు. మన్నార్‌చోప్రా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కబీర్‌సింగ్, సప్తగిరి, పృధ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రంశ్రీను, రఘు, రాజారవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:సి.రాంప్రసాద్, సంగీతం:దినేష్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, మాటలు:్భవానీప్రసాద్, నిర్మాత: ఆర్.సుదర్శన్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ.