ప్లాటినమ్ డిస్క్‌లో నీ జతలేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై నాగశౌర్య, పారుల్, సరయు ప్రధాన తారాగణంగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీ జత లేక’. ఈ చిత్రం ఆడియోకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ, తమ సంస్థలో వస్తున్న తొలి చిత్రంలో పాటలకు ఇంత ఆదరణ లభించడం ఆనందంగా వుందని, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. దర్శకుడు ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించారని నిర్మాత నాగరాజు గౌడ్ అన్నారు. ఇది తప్పక విజయవంతం అవుతుందన్న ఆశాభావాన్ని దర్శకుడు లారెన్స్ దాసరి వ్యక్తం చేశారు. మంచి పాటలకు ఆదరణ లభించినందుకు సంతోషంగా వుందని కథానాయకుడు నాగశౌర్య అన్నారు. కార్యక్రమంలో సాయివెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయం, సరయు, బుజ్జి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్లాటినమ్ డిస్క్‌లను అతిథులు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందజేశారు.