‘బాబు బంగారం’ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ- ‘వెంకటేష్ బాబు బంగారమే.. నిర్మాతల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా 30 ఏళ్ల కెరీర్‌ను నెట్టుకురావడం చిన్న విషయం కాదు. ఆయన నిర్మాతల కష్టసుఖాలు తెలిసిన హీరో. ఆయన సక్సెస్ రేట్ ఎక్కువే. కథను బట్టే నటించాడు. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేసి నంది అవార్డులు పొందిన నటుడు. బాబు బంగారం సినిమా పాటలను తెలుగుదనంతో కూడుకున్నట్లు అందించారు మారుతి.’ అని అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ, ‘అభిమానుల ప్రేమ కోసమే నేను ఆడియో వేడుకలకు వస్తాను. మారుతి చాలా కాన్ఫిడెంట్‌గా నన్ను డిఫరెంట్‌గా చూపిస్తానన్నాడు. అలాగే చేశాడు. ఈ సినిమా ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, నువ్వు నాకు నచ్చావ్‌లా ఉంటుంది. బాబు బంగారం సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. మారుతి మాట్లాడుతూ, ‘వెంకటేష్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో సినిమా వుంటుంది. పాటలు ఇంత రిచ్‌గా ఉందంటే నిర్మాతలే కారణం.’ అన్నారు. కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, వెంకటేష్, జిబ్రాన్, మారుతి, నాని, తమ్మారెడ్డి భరద్వాజ, రామ్‌లక్ష్మణ్, రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళి, వెనె్నల కిషోర్, మున్నా, వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, గుండు సుదర్శన్ నటించిన ఈ చిత్రానికి డాన్స్:బృంద, శేఖర్, స్టంట్స్:రవి పరమ్, ఆర్ట్:రమణ వంక, ఎడిటర్:ఉద్ధవ్.ఎస్.బి., సంగీతం:జిబ్రాన్, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం:మారుతి.