ఇక తల్లిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఇద్దరూ నాగార్జునకి జోడీగా నటించినవాళ్ళే. నాగార్జున పక్కన కనిపించిన ఆ ఇద్దరూ కూడా నాగ్‌కి తగ్గ జోడీ అనిపించినవాళ్లే. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ తల్లి అవుతోంది. ఆమెకి కూతురుగా మరో హీరోయిన్ నటిస్తోంది. ఇది ఎంత విశేషం కదూ! వివరాల్లోకి వెళితే- అనుష్క ప్రధాన పాత్రధారిగా అశోక్.జి దర్శకత్వంలో ‘్భగ్‌మతి’ తెరకెక్కుతోంది. అందులో అనుష్కకి తల్లిగా టబు నటించబోతోందట. నాగార్జునకి మాజీ లవర్‌గా టబుకి పేరుంది. కూలీ నెంబర్ వన్, ప్రేమదేశం, నినే్నపెళ్లాడుతూ లాంటి చిత్రాలతో తెలుగులో ఓ ఊపు ఊపేసిన టబు ఈసారి తల్లి పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట. తల్లి పాత్ర అయినా అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అందుకే టబు ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఆమె భారీగానే పారితోషికం మట్టుజెబుతున్నట్టు సమాచారం.