మజ్నుగా నాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ముప్ఫైఏళ్ళ క్రితం తెరకెక్కిన మజ్ను చిత్రం గురించి ఈమధ్య ఒక్కసారిగా ఇండస్ట్రీ మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అందుకు కారణం నాగార్జున నటించిన ఆ సినిమా పేరును ఆయన తనయుడు నాగచైతన్య సినిమాకి వాడబోతున్నారనే ప్రచారం సాగడమే. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ రీమేక్‌కి మజ్ను పేరును ఫిక్స్‌చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నాయి. చివరి నిమిషంలో ప్రేమమ్ రీమేక్‌కి ప్రేమమ్ పేరైతేనే బాగుంటుందని, ఆ పేరునే నిర్ణయించేశారు. దీంతో మజ్ను టైటిల్‌పై మరో హీరో నాని కర్చ్ఫీ వేసేశాడు. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న నాని కొత్త చిత్రానికి మజ్ను అయితే బాగుంటుందని అదే పేరును ఫిక్స్ చేశారు. ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జెమిని కిరణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.