అందరికీ నచ్చేలా వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో షెడ్యూల్ ప్రారంభించారు. ఈనెల 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను, ఓ ఫైట్‌ను, ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, గతంలో జయ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో అంతకన్నా బిగ్ హిట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, చిన్న చిత్రమైనా భారీ బడ్జెట్‌లో, ఉన్నతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరిస్తున్నామని అన్నారు. ఓవర్‌సీస్‌నుండి కూడా భారీ అంచనాలతో బిజినెస్ ఆఫర్స్ వస్తుండడం ఆనందంగా వుందని, ఆగస్టులో జరిగే ఐదో షెడ్యూల్‌తో సినిమా పూర్తిచేస్తామని ఆయన అన్నారు. కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూసేవిధంగా ఈ సినిమా రూపొందుతోందని, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ చేసి ఓ అపార్ట్‌మెంట్ నేపథ్యంలో సాగే ఈ కథ దర్శకురాలిగా తనకు మంచి పేరు తెస్తుందని, కజకిస్తాన్‌లో చిత్రీకరించిన పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని దర్శకురాలు జయ అన్నారు. రమాప్రభ, సాయికుమార్, ఈశ్వరీరావు, పృధ్వీ, కాశీవిశ్వనాధ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, ఫణి, మాధవి, జెన్నీ, లతీష్, కళ్యాణి, కుమారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:డి.జె.వసంత్, కెమెరా:వాలిశెట్టి వెంకట సుబ్బారావు, నిర్మాత:బి.ఎ.రాజు, దర్శకత్వం:జయ.బి.