జార్జియాలో శాతకర్ణి యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జి.సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ.. ‘ఈనెల 4నుండి ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఇందులో క్లైమాక్స్ చిత్రీకరణ జరపనున్నాం. శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే భారీ పోరాట సన్నివేశాలు జార్జియాలోని వౌంట్ కజ్బెగ్ పర్వతంవద్ద చిత్రీకరిస్తాం. రష్యాకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. బాలకృష్ణతోపాటు పలువురు నటులు పాల్గొంటారు’ అని చెప్పారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ‘మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని చిలుకూరు దగ్గరలో చిత్రీకరించాం. మూడో షెడ్యూల్ జార్జియాలో జరుపుతున్నాం. దాంతోపాటు సి.జి.వర్క్ కూడా ప్రారంభమైంది. మూడు వారాలపాటు చిత్రీకరణ జరిపే ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్ల సహకారంతో అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జ్ఞానశేఖర్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.