చుట్టాలబ్బాయి టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది హీరోగా శ్రీఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీని టీజర్‌ను శనివారం హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ,‘కన్ఫ్యూజన్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించాం. వీరబాబు చక్కగా డైరెక్ట్‌చేశారు. రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిం చాం. చిన్న మిస్ అండర్ స్టాండింగ్‌తో ఈ సినిమా మొత్తం డ్రైవ్ అవుతుంది. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మలయాళంలో సుమారుగా 11 సినిమాలు చేసిన నమితాప్రమోద్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది, జూలై 6న పాటలను విడుదల చేసి, జూలై రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ, ‘ఈ చిత్ర నిర్మాతలు ఇద్దరు నాతో వేరువేరుగా సినిమాలు చేయాలనుకున్నా, ఇద్దరితో కలిసి సినిమా చేస్తే మంచి ఔట్‌పుట్ వస్తుందని వారిని ఒప్పించాను. అందరినీ ఆకట్టుకునే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.’ అని తెలిపారు.