మరల తెలుపనా ప్రియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిన్స్, వ్యోమానంది జంటగా శ్రీ చైత్రా చలనచిత్ర పతాకంపై వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ- ఓ విభిన్నమైన ప్రేమకథతో వైవిధ్యమైన మనస్తత్వాలు వున్న అమ్మాయి, అబ్బాయిమధ్య సాగే యుద్ధంగా ఈ ప్రేమకథ సాగుతుందని తెలిపారు. హైదరాబాద్, గోవా, రుషికేశ్, హరిద్వార్, శివపురి, రాజమండ్రి, లక్కవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో పాటలు హైలెట్‌గా వుంటాయని, హీరో హీరోయిన్లమధ్య ప్రతి సన్నివేశం యువతను ఆలోచించేలా చేస్తుందని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె అన్నారు. పూజా రామచంద్రన్, సమీర్, రవివర్మ, ఫణి, సాయి, సన, కల్పలత, మృణాళిని, పావనిరెడ్డి, సౌమ్య, రమ్య, అను, రియా తదితరులు నటించారు.