కండక్టర్ పాత్రలో అశ్విన్ రాణించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- నిర్మాత ఎం.ఎస్.రాజు
‘నా కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘రైట్ రైట్’ చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని కేంద్రాలనుండి మంచి టాక్ వినిపిస్తోంది. అనేకమంది ఫోన్ చేసి మెచ్చుకుంటుంటే, తండ్రి గా ఆనందాన్ని పొందుతున్నాను’ అని నిర్మాత ఎం.ఎస్.రాజు తెలిపారు. శ్రీ సత్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుమంత్ అశ్విన్, పూజా జవేరి, ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన తారాగణంగా మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన ‘రైట్ రైట్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని ఎం.ఎస్.రాజు పలు విషయాలు తెలుపుతూ- సున్నితమైన ప్రేమకథను దర్శకుడు చక్కగా తెరకెక్కించారని, సినిమా అంతా సరికొత్తగా అశ్లీలతకు తావులేకుండా ఆహ్లాదకరంగా సాగుతుందని అన్నారు. తాను తొలి సగం చూసినపుడు బావుందనిపించిందని, మలి సగం చూశాక ఇంకా బాగుందనిపించిందని, కథలో ట్విస్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా వుంటాయని ఆయన అన్నారు. కండక్టర్ పాత్రలో అశ్విన్ బాగా నటించారని, ఎస్.కోటనుండి గవిటికి వెళ్ళే బస్సులో జరిగే కథనంతో అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను స్క్రీన్‌పై చక్కగా ఆవిష్కరించారని అన్నారు. నేపథ్య సంగీతం, పాటలు, లొకేషన్లు కొత్తగా వుంటాయని, నాజర్, షకలక శంకర్, ధన్‌రాజ్, జీవా, బాహుబలి ప్రభాకర్ తదితరుల పాత్రలు ప్రేక్షకాదరణ పొందుతాయని ఆయన వివరించారు.