చివరి షెడ్యూల్‌లో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా వివరాల గురించి దర్శకుడు జ్యోతికృష్ణ తెలియజేస్తూ, గోపీచంద్‌కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలని, ఆయన హీరోగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రమిదని, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని అన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని, జగపతిబాబు పాత్ర హైలెట్‌గా వుంటుందని, త్వరలోనే పాటలను విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:యువన్ శంకర్‌రాజా, కెమెరా:వెట్రి, ఫైట్స్:పీటర్ హెయిన్స్, ఆర్ట్:మిలన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం:ఎ.ఎన్.జ్యోతికృష్ణ.