10న తుహిరే మేరీ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికాశ్, కల్యాణి, రేష్మా ప్రధాన తారాగణంగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎస్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదలకు సిద్ధంచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిచే ఈ చిత్రంలో కాలేజీ చదువులు పూర్తిచేసిన అబ్బాయి తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనే కథాంశంతో వుంటుందని తెలిపారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, జూన్ 10న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై, బెంగుళూరు ప్రాంతాలలో కూడా సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రేమకథలతో అనేక చిత్రాలు వచ్చినా ఈ సినిమా ఓ డిఫరెంట్ ప్రయోగంగా నిలుస్తుందని, యూత్‌కి ఫ్యామిలీకి నచ్చుతుందని హీరో వికాశ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జూడాశాండి, ఎడిటింగ్:రాజు లీల, పాటలు:చాణక్య, నిర్మాత:కవనరెడ్డి నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.డి.ఉదయ్‌కుమార్.