కజకిస్థాన్‌లో వైశాఖం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వైశాఖం’. ఈసినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, ‘‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘లలీ’ వంటి చిఅతాల తరువాత మా సంస్థలో రాబోతున్న మరో చిత్రం ‘వైశాఖం’. లలీ సినిమా తరువాత మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది. మా బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈసారి వైశాఖం పాటలను కొత్త లొకేషన్స్‌లో చిత్రీకరించాలని ఎన్నో ప్రాంతాలను సెర్చ్‌చేసి చివరగా కజకస్థాన్‌లో 15 రోజులపాటు మూడు పాటలను చిత్రీకరించారు. హైబడ్జెట్‌తో హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ, కంట్రోల్డ్ బడ్జెట్‌లో చాలా కూల్‌గా ఈ సినిమా చేయాలనుకున్నాను. కానీ అంతా రివర్స్ అయింది. ఎందుకంటే కథ విషయంలో నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేను. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త లొకేషన్స్‌ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. దానికోసం కజకస్థాన్ వెళ్లి పాటలను చిత్రీకరించాం. ప్రతి షాట్ అద్భుతంగా వచ్చింది. వసంత్ అద్భుతమైన మ్యూజిక్‌కు తగ్గట్టుగా పిక్చరైజేషన్ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్ మీద నడిచే కథ ఇది. ఈ సినిమాకు మొదటినుండి అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టాలని భావించాను. అందుకే వైశాఖం అనే పేరును సెలక్ట్ చేసుకున్నాను’ అన్నారు.