విశాల్‌తో తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా, జగపతిబాబు కాంబినేషన్‌లో హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మాత జి.హరి ఓ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. విశాల్ కెరీర్‌లో హై రేంజ్ చిత్రంగా నిలవనుందని, షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. విశాల్, తమన్నా జంట సినిమాకి హైలెట్ అవుతుందని, జగపతిబాబు విలనిజం ఆకట్టుకుంటుందని, తరుణ్ అరోరా మరో విలన్‌గా నటిస్తున్నారని తెలిపారు. సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం పూర్తిచేశామని, జూన్ 9 నుండి నెల రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి ఓ షెడ్యూల్ చెన్నైలోనూ, మరో షెడ్యూల్ ఫారిన్‌లోనూ చిత్రీకరిస్తామని ఆయన తెలిపారు. నిరోషా, బ్రహ్మానందం, వెనె్నల కిశోర్, సూరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హిప్ హాప్ తమిళ, కెమెరా:రిచర్డ్స్, ఎడిటింగ్:సెల్వ, నిర్మాత:జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సురాజ్.